బాలీవుడ్ సెలబ్రిటీలు పార్టీలంటే మాములుగా ఉండవు.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ఆ పార్టీలో కనిపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హాట్ భామ మలైకా అరోరా తన పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఓ పార్టీ ఏర్పాటు చేసింది. తన 46వ పుట్టినరోజు గ్రాండ్ గా జరుపుకుంది.

ఈ పార్టీకి అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, అనన్య పాండే వంటి బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు మలైకా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా హాజరయ్యాడు. తన భర్త అర్భాజ్ ఖాన్ కి దూరమైనతరువాత మలైకా.. అర్జున్ కపూర్ తో సన్నిహితంగా మెలుగుతోంది. 

 

ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ షోలో వీరి పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. మరి తన ప్రేయసి బర్త్ డే పార్టీకి అర్జున్ కపూర్ రాకుండా ఉంటాడా..? నిజానికి పార్టీలో అతడే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అట.

(Also Read) బిగ్ బాస్ బ్యూటీతో క్రికెటర్ హార్ధిక్ పాండ్యా పెళ్లి..?

ఇక మలైకా సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి తన హాట్ లుక్స్ తో షేక్ చేసిందట. ఈ పార్టీలో ఆమె వేసిన స్టెప్పులు హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. అలానే అర్జున్ కపూర్ కూడా తన డాన్స్ తో రెచ్చిపోయాడు. ఈ పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

And the birthday girl ❤🔥 #MallaikaArora

A post shared by Viral Bhayani (@viralbhayani) on Oct 22, 2019 at 4:48pm PDT