సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ కి ఉన్న బంధం ఏంటో తెలియదు కానీ.. మన తారలకు క్రికెటర్లతో ఎఫైర్లు ఉన్నాయంటూ చాలా వార్తలు వస్తుంటాయి. గతంలో చాలా మంది హీరోయిన్లు క్రికెటర్లతో డేటింగ్ చేశారు. అయితేఆ బంధాలు ఎక్కువ రోజులు నిలవలేదు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మాత్రం విరాట్ కొహ్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మిగిలిన రిలేషన్స్ ఏవీ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు.

కానీ తరచూ క్రికెటర్లకు, హీరోయిన్లకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, బుమ్రా మధ్య ఎఫైర్ సాగుతుందంటూ వార్తలు వచ్చాయి.  అలానే నిధి అగర్వాల్ చాలా కాలంగా ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో క్రికెటర్ హార్ధిక్ పాండ్యా సినీ నటి నటాషాను ప్రేమ వార్తలు హల్చల్ చేస్తున్నారు. 

 

హార్ధిక్ పాండ్యా కొంతకాలంగా బిగ్ బాస్ 8 కంటెస్టంట్ నటాషాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కొన్ని ఈవెంట్స్ లో కనిపించడం, సన్నిహితంగా మెలగడంతో ప్రేమ వార్తలు ఊపందుకున్నాయి. హార్ధిక్.. నటాషాను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని.. వీరి ప్రేమకి ఇంట్లో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. 

బన్నీ సెంటిమెంట్ లుక్.. టీజర్ లో గట్టిగా వాడేశాడు!

ఇటీవలే అనారోగ్యం కారణంగా హార్ధిక్ పాండ్యా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇదే సమయంలో ట్రైనర్, డాక్టర్ ల సమక్షంలో హార్ధిక్ పాండ్యా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మళ్లీ టీంలోకి వచ్చిన తరువాత పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని పాండ్యా సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం నటాషా నాచ్ బాలియే సీజన్ 9లోపాల్గొంటుంది. బుల్లితెరపై షోలు చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.