బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ నటి మలైకా అరోరా చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని కథనాలను ప్రచురించారు. కాఫీ విత్ కరణ్ షోలో కూడా వీరి పెళ్లి టాపిక్ వచ్చింది.

ఇప్పటివరకు వీరి రిలేషన్షిప్ పై సైలెంట్ గా ఉన్న ఈ జంట తాజాగా పెదవి విప్పింది. నేహా ధూపియా టాక్ షోలో పాల్గొన్న మలైకా తన పెళ్లి విషయంపై స్పందించింది. అర్జున్ కపూర్ ని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఈ బ్యూటీ తన పెళ్లి ఓ డ్రీమ్ లా ఉండాలని చెప్పింది.

అల్లు బ్రదర్ సినిమా.. చరణ్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ?

పెళ్లి కచ్చితంగా బీచ్ దగ్గర చేసుకుంటానని.. ఎల్లీ సాబ్ బ్రాండ్ వైట్ కలర్ గౌన్ వేసుకుంటానని.. తన గర్ల్ గ్యాంగ్ తన చుట్టూ ఉండాలని.. తన క్లోజ్ ఫ్రెండ్ వాబిజ్ మెహతా  తప్పకుండా తన పక్కనే ఉండాలని చెప్పింది. తనకు ఫోటోలు తీయడం రాదనేది అర్జున్ ఫీలింగ్ అని చెప్పింది. తన ఫోటోలు అర్జున్ బాగా తీస్తాడు కానీ తనకు మాత్రం ఫోటోలు తీయడం రాదని ఎప్పుడూ తిడుతూ ఉంటాడని చెప్పుకొచ్చింది.

మలైకాకి ఇది వరకే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం జరిగింది. వీరికి పదహారేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోయారు. వీరి విడాకులకు కారణం అర్జున్ కపూర్ అని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ విషయంలో సల్మాన్ ఖాన్.. అర్జున్ కపూర్ పై చాలా కోపంగా ఉన్నాడని చెబుతుంటారు. వయసులో మలైకా.. అర్జున్ కంటే పదేళ్లు పెద్దది. నిజానికి అర్జున్ కపూర్ ఆమెని పెళ్లి చేసుకోవడం కపూర్ ఫ్యామిలీకి ఇష్టం లేదట. కానీ ఈ విషయంలో అర్జున్ ఎవరి మాట లెక్క చేయడం లేదట. మరి వీరి బంధం ఎంతకాలం నిలుస్తుందో చూడాలి!