వరుణ్ తేజ్ ప్రస్తుతం మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. వరుణ్ కంచె, అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించాడు. నటుడిగా ఆ చిత్రాలు వరుణ్ స్థాయిని పెంచాయి. గద్దలకొండ గణేష్ చిత్రం కూడా వరుణ్ కు సాహసోపేత చిత్రమే. ఫిదా, తొలిప్రేమ లాంటి రొమాంటిక్ హిట్స్ పడ్డ సమయంలో వరుణ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఎంచుకున్నాడు. 

గద్దలకొండ గణేష్ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ ఓ డెబ్యూ దర్శకుడికి ఓకె చెప్పాడు. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు బాక్సింగ్ నేపథ్యంలో సిద్ధం చేసిన కథ వరుణ్ ని ఇంప్రెస్ చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 

తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రం కోసం అల్లు బాబీ భారీబడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కథ పరంగా ఈ చిత్రానికి బడ్జెట్ బాగా ఖర్చవుతుందని టాక్. అందుకు బాబీ సిద్ధంగా ఉన్నాడట. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ కియారా అద్వానీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమెని సంప్రదించగా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఆమె అడిగినంత సమర్పించుకునేందుకు నిర్మాత సిద్ధమయ్యారు. త్వరలో హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. భారీ రెమ్యునరేషన్ అందుకోనుండడంతో కియారాకు ఇది ఒకరకంగా మంచి ఆఫరే.

కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను చిత్రంలో మహేష్ సరసన, వినయ విధేయ రామలో రాంచరణ్ సరసన నటించింది.