సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేర్ నీకెవ్వరు' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం వరుస ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది. పండగ సీజన్ కావడంతో ఓపెనింగ్ రికార్డులు ఓ రేంజ్ లో వస్తాయని అంచనా వేస్తున్నారు.

మహేష్ బాబు కూడా ఈ సినిమా సక్సెస్ పై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. పండగకి ఇది పెర్ఫెక్ట్ సినిమా అని.. ఆడియన్స్ ని అలరించడం ఖాయమని ఇటీవల మహేష్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ సినిమాపై మహేష్ ఎంత నమ్మకంగా ఉన్నాడంటే.. సినిమా రిలీజ్ కి ముందే చిత్రబృందానికి గ్రాండ్ పార్టీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.

ఆ సంఘటన జరిగిన తర్వాత 3 రోజుల పాటు షాక్ లో ఉన్నా: త్రివిక్రమ్

ఈరోజు సాయంత్రం 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ కి హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో పార్టీ ఇస్తున్నారు. ఈ సినిమాలోని నటీనటులు, టెక్నీషియన్లు ఈ పార్టీకి హాజరవుతారట. సాయంత్రానికి దాదాపుగా ప్రీరిలీజ్ ప్రమోషన్స్ పూర్తవుతాయి కాబట్టి 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఈ పార్టీలో మునిగిపోతారు.

సినిమా రిలీజ్ తరువాత ఇలాంటి పార్టీలు ఇవ్వడం సాధారణమే.. కానీ మహేష్ బాబు ముందే ఇస్తున్నాడంటే సినిమా విజయం పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్ధమవుతోంది. మహేష్ బాబు మాత్రమే కాదు.. దర్శకుడు అనీల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకర ఇలా అందరూ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నారు.