సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఉషారుగా ఉన్నాడు. ఆయన తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’  బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తూ ..భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై దర్శకుడు అనిల్‌ బాగా ఫోకస్‌ పెట్టడం కలిసొచ్చింది. ఓపెనింగ్స్‌ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్‌ను దాటేసే అవకాశముందని ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి. దాంతో మహేష్ కెరీర్ లోనే ఈ సినిమా హైయిస్ట్ గ్రాసర్ గా నిలవబోతోంది.  

ఈ సందర్బంగా మహేశ్‌బాబు తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధాంక్స్ చెప్పారు . ‘సరిలేరు నీకెవ్వరు సినిమాకు బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌ ఇచ్చారు. అందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’ అంటూ ట్వీట్‌ చేసిన మహేష్ .. అభిమానులతో ట్విటర్‌లో క్వశ్చన్‌-అన్వర్‌ సెషన్‌ కోసం ఎదురుచూస్తున్నానని, తనను ప్రశ్నలు అడగాలని కోరారు.

ఇంట్రస్టింగ్ : ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌, అఖిల్ చిత్రం స్టోరీ లైన్!
 
మ‌హేష్  మాట్లాడుతూ “తెలుగు సినిమా ఆడియ‌న్స్ కీ, నాన్న‌గారి అభిమానుల‌కీ, నా అభిమానుల‌కీ సిన్సియ‌ర్ గా ధ‌న్య‌వాదాలు. జ‌న‌వ‌రి 11నే సంక్రాంతిని మాకు ఇచ్చారు. ఇవాళ పొద్దున్నే నేను, దిల్‌రాజుగారు, అనిల్ సుంక‌ర క‌లిసి షేర్స్ మాట్లాడుకుంటూ మిరాకిల్స్ ఫీల‌య్యాం. నిజంగా మైండ్ బ్లాక్ అయింది. హ్యాట్సాఫ్ టు తెలుగు సినిమా. టెక్నీషియ‌న్స్ అంద‌రికీ థాంక్స్. త‌మ్మిరాజు, శేఖ‌ర్ మాస్ట‌ర్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఆర్టిస్టులు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

రిలీజ్ రోజు సినిమాను నా పిల్ల‌ల‌తో చూస్తాను. అది నాకు సెంటిమెంట్‌. నేను నిన్న పిల్ల‌ల‌తో సినిమా చూసి విజ‌య‌శాంతిగారిని ఈవెనింగ్ క‌లిశాను. ఆ కేర‌క్ట‌ర్‌ను ఆవిడ త‌ప్ప‌, ఇంకెవ‌రూ చేయ‌లేరు. ఇంత‌కు ముందు కూడా ఈ విష‌యాన్ని చెప్పాను. ఇప్పుడు మ‌ళ్లీ చెబుతున్నాను. ఈ ప్రాజెక్టులో ఆవిడ ప‌నిచేసినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
 
ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు.