Asianet News TeluguAsianet News Telugu

మరో 'కొరియా' రీమేక్ తో సురేష్ ప్రొడక్షన్..దర్శకుడు ఎవరంటే..?

2017లో వచ్చిన  ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్  చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ కామెడీ. పోలీస్ అకాడమిలో ట్రైనింగ్ అవుతున్న ఇద్దరు పోలీస్ లు..అత్యుత్సాహంతో ట్రైనింగ్ పూర్తికాకుండానే ఓ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి బయిలుదేరతాడు. 

Suresh Productions will remake Mid Night Runners movie
Author
Hyderabad, First Published Jan 14, 2020, 10:39 AM IST

ఇంతకు ముందు తమిళం, మళయాళం, హిందీ చిత్రాల రీమేక్ రైట్స్ తెచ్చుకునే వారు నిర్మాతలు. వాటిని తెలుగు నేటివిటికు అణుగుణంగా తయారు చేసి హిట్ కొట్టేవారు. అయితే అక్కడ సినిమాలే ఇక్కడ అదే రోజు రిలీజ్ అవుతూండటంతో ఇతర దేశాలకు రీమేక్ ల కోసం వెళ్లాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ రీసెంట్ గా కొరియానుంచి రైట్స్ తెచ్చుకుని చేసిన చిత్రం  ‘ఓ బేబీ’ మంచి హిట్టైంది. దాంతో మరో కొరియా రీమేక్ కు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

సెంటిమెంటల్ హిట్స్.. వీళ్లు ఒక్క సీన్ లో ఉన్నా చాలు..!

2017లో వచ్చిన  ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్  చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారు. ఇదొక యాక్షన్ కామెడీ కామెడీ. పోలీస్ అకాడమిలో ట్రైనింగ్ అవుతున్న ఇద్దరు పోలీస్ లు..అత్యుత్సాహంతో ట్రైనింగ్ పూర్తికాకుండానే ఓ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి బయిలుదేరతాడు. ఆ క్రమంలో రకరకాల సమస్యలు వస్తాయి. వాటిని దాటుకుని ఆ కిడ్నాప్ వెనక ఉన్న ఓ పెద్ద రాకెట్ ని బయిటపెడతారు. కొరియాలో ఇద్దరు యంగ్ హీరోలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో చేసారు. కానీ తెలుగుకు వచ్చేసరికి హీరోలను తీసేసి, ఇద్దరు హీరోయిన్స్ తో ఈ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు ప్రధాన పాత్రదారులుగా రెజినా, నివేత థామస్ నటించే అవకాసం ఉంది. అలాగే ఈ రీమేక్ కోసం దర్శకుడిగా సుధీర్ వర్మను అడిగారట. సుధీర్ వర్మ ,శర్వానంద్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘రణరంగం’ డిజాస్టర్ అయ్యింది. అయితే సినిమా బాగాతీసాడు కానీ స్క్రిప్టు బాగా చేయలేదని అన్నారు. దాంతో ఎలాగూ స్క్రిప్టు రీమేక్ సినిమా కాబట్టి ఎదురుగా ఉంటుంది కాబట్టి...టెక్నికల్ గా డీల్ చేస్తే సరిపోతుందని సుధీర్ వర్మను తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై ఇంకా అఫీషియల్ ఎనౌన్సమెంట్ వెలువడాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios