సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటించాడు. 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో మెరిసింది. 

సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో శుక్రవారం రోజు వరంగల్ లో చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకకు మహేష్, విజయశాంతితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. 

సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వేదికపై మహేష్ బాబు ఎనర్జిటిక్ గా ప్రసంగించారు. తన కెరీర్ లో తాను తీసుకున్న బెస్ట్ డెసిషన్స్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రం ఒకటని మహేష్ తెలిపాడు. కొత్తగా ట్రై చేయడం లేదు.. ఒకేరకమైన సినిమాలు చేస్తున్నారని తనపై వస్తున్న విమర్శపై మహేష్ స్పందించాడు. మీ ఫీడ్ బ్యాక్ నాకు ముఖ్యం. ఒకే తరహా చిత్రాలు వస్తున్నాయనే ఫీడ్ బ్యాక్ గమనించా. కథకు కమిట్ కావడం వల్లే అలా జరిగింది. 

అల్లు అర్జున్, మహేష్ బాబుకి ఆ రికార్డ్ సాధ్యమేనా ?

ఆ ఫీడ్ బ్యాక్ గమనించే ఈ చిత్రానికి అంగీకరించినట్లు మహేష్ తెలిపాడు. విజయశాంతి గారితో మరోసారి నటించాలని ఉన్నట్లు మహేష్ తెలిపాడు. ఇక విజయశాంతి మాట్లాడుతూ.. ఒసేయ్ రాములమ్మ చిత్రం తర్వాత నా పేరు రాములమ్మగా మారిపోయింది. చాలా రోజుల తర్వాత సరిలేరు చిత్రంతో అంతటి సక్సెస్ అందుకున్నా అని విజయశాంతి తెలిపింది. 

తాను భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించాలంటే తన పాత్ర దద్దరిల్లిపోయే విధంగా ఉండాలని విజయశాంతి అన్నారు. లేకుంటే చేయనని తెలిపారు.