టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హిరోలున్నా రానా దక్కించుకున్న క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఒక్క బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు దక్కించుకొని బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో.. హీరోగానే కాకూండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నేడు రానా 35వ వసంతంలోకి అడుగు పెట్టాడు.

ఈ బర్త్ డే సందర్భంగా సినీ సెలబ్రెస్టిస్ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. పుట్టినరోజు సందర్బంగా రానా నటిస్తున్న వీరాటపర్వం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఎర్రగుడ్డతో రానా చాలా ఇంటెన్సివ్ లుక్ తో కనిపిస్తున్నాడు. నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుంది.

read also చంటి నుంచి F2 వరకు.. వెంకటేష్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

ఇకపోతే బర్త్ డే సందర్బంగా రానాకి మహేష్ బాబు స్పెషల్ విషెస్ అందించారు. నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ కావాలని మహేష్ రానా తో ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. అందుకు సమాధానంగా రానా థ్యాంక్యూ చీఫ్ అని ట్వీట్ చేశాడు. ఇక బాలీవుడ్ ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహార్ సైతం రానాకి బెస్ట్ విషెస్ అందిస్తూ వీరాటపర్వం లుక్ చాలా బావుందని ప్రశంసించారు. వీరితో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రామ్ అక్కినేని హీరోలు రానికి పుట్టినరోజు శుభాకంక్షాలు అందించారు.