టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాపై అంచనాల డోస్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా టీజర్ విడుదలైన కొన్ని నిమిషాలకే రికార్డులు బద్దలుకొట్టడం స్టార్ట్ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక వ్యూప్స్ అందుకున్న మొట్ట మొదటి టీజర్ గా గుర్తింపు అందుకుంది.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

18మిలియన్ల్ వ్యూప్స్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే నేడు దర్శకుడి పుట్టినరోజు సందర్బంగా మహేష్ బాబు తన బెస్ట్ విషెస్ అందించారు. "డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో ఈ సినిమా చేయడం ఎప్పటికి మరచిపోలేని, మంచి అనుభవం. మీకు మరిన్ని విజయాలు సంతోషాలు కలగాలనికోరుకుంటున్నా. మీ నుంచి ఇలానే మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి" అని మహేష్ ట్వీట్ చేశారు.

అందుకు దర్శకుడు అనిల్ సమాధానం ఇస్తూ.. "విషెస్ కి చాలా థ్యాంక్స్ మహేష్ గారు. మీతో వర్క్ చేసిన జర్నీని అద్భుతంగా మార్చారు. మీతో కలిసి పనిచేయడం వల్ల చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇది నాకు చిరకాలం గుర్తిండిపోతుంది" అని ట్వీట్ చేశారు. అనిల్ కి మహేష్ అభిమానులు కూడా బెస్ట్ విషెస్ అందించి ఆయన బర్త్ డే ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేశారు. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.