సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మహేష్ చాలా రోజుల తరువాత ఒక ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైన్ రోల్ లో నటిస్తుండడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

సరిలేరు నీకెవ్వరు టీజర్ ని ఈ నెల 22న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబందించిన పోస్టర్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇక శుక్రవారం 5:04గంటలకు టీజర్ వచ్చింది అంటే మహేష్ అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకినట్లే అని చెప్పవచ్చు. దర్శకుడు అనిల్ రావిపూడి యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు మహేష్ యాక్షన్ సీన్స్ ని టీజర్ లో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి టీజర్ అభిమానుల అంచనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక మహేష్ మాత్రం డిసెంబర్ నుంచి తన అసలైన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నాడట. సినిమాలో నటించిన కమెడియన్స్ ని మహేష్ స్పెషల్ ఇంటర్వ్యూ చేననున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి అల్లు అర్జున్ ఆలా వైకుంఠపురములో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

సరిలేరు నీకెవ్వరు: వంశీ పైడిపల్లికి మహేష్ రిక్వెస్ట్