సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాల డోస్ మరింత పెరిగింది. రీసెంట్ గా టీజర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ మహేష్ లోని యాక్షన్ అండ్ కామెడీ ఎలిమెంట్ ని హైలెట్ గా చూపించారు. ఇక సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)

అసలైతే జనవరి 12న సినిమా రిలీజ్ కానున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన మహేష్ టీమ్ ఇప్పుడు డేట్ ని చేంజ్ చేసే పనిలో పడ్డారు. సినిమాను జనవరి 11న రిలీజ్ చేయాలనీ ఆలోచిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 5న నిర్వహించడానికి నిర్మాతలు డిసైడ్ అయినట్టు సమాచారం,  ప్రస్తుతం చివరి షెడ్యూల్ ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్న మహేష్ రెగ్యులర్ ప్రమోషన్ ని మాత్రం డిసెంబర్ లో స్టార్ట్ చేయనున్నాడట.

మరోవైపు అల్లు అర్జున్ పాటలతో రచ్చ మొదలెట్టాడు. అల.. వైకుంఠపురములో స్ట్రాంగ్ పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కూడా భారిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లిస్ట్ లో కొనసాగుతున్నాయి. కానీ ఇంకా మహేష్ నుంచి ఎలాంటి పాటలు రాలేదు. రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రమోషన్స్ లో మాత్రం ఇప్పటికి మహేష్ కంటే బన్నీ స్పీడ్ మీద ఉన్నాడు. మరి సంక్రాంతి ఫైట్ లో ఎవరు అత్యధిక కలెక్షన్స్ ని అందుకుంటారో చూడాలి.