మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింద. అయితే టీజర్ రిలీజైన 24గంటల్లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా 18మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ నెంబర్ వన్ టీజర్ గా స్థానం సంపాదించుకుంది.

ఇంతవరకు తెలుగు పరిశ్రమలో ఏ టీజర్ కూడా ఈ రేంజ్ లో వ్యూవ్స్ ని అందుకోలేదు. సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ క్రియేట్ పెరుగుతూ వస్తోంది. ఇక సినిమా టీజర్ ఆ క్రేజ్ ని మరింతగా పెంచేసింది. టీజర్ లో విజయశాంతి లుక్ ని కూడా ఉంచిన చిత్ర యూనిట్ హీరోయిన్ పాత్రను మాత్రం యాడ్ చేయలేదు. అందుకు కారణం ఏమిటా అని పలు రకాల రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

అసలు మ్యాటర్ ఏమిటంటే.. సినిమా టీజర్ లో రష్మిక పాత్రను చూపించకపోవడం ఒక కారణం ఉందట. ఆమె పాత్రను స్పెషల్ గా చూపించాలని మరొక వెరైటీ ప్రోమోను ఎడిట్ చేస్తున్నారట. త్వరలోనే ఆ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా చిత్ర యూనిట్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అసలైతే సినిమాని జనవరి 12న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ అదేరోజు అల.. వైకుంఠపురములో కూడా రిలీజ్ అవుతుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కరెక్ట్ కాదని రెండు సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్స్ ని మారుస్తున్నట్లు సమాచారం. అందుకే సరిలేరు నీకెవ్వరు సినిమాని జనవరి 11న రిలీజ్ చేయాలనీ చర్చలు జరుపుతున్నారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జనవరి మొదటివారంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.