సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే నేడు సినిమాకు సంబందించిన స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

'ప్రతిరోజూ పండగే' మూడు రోజుల కలెక్షన్స్ !

సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ పై మొదటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ విడుదలైనప్పుడే దేవి ఇచ్చిన బీజీఎమ్ బాగా వైరల్ అయ్యింది. దీంతో మహేష్ స్టైల్ కి తగ్గట్టుగా సాంగ్ ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ ఫారిన్ ఆర్కెస్ట్రా తో సాంగ్ ని కంపోజ్ చేసినట్లు మేకింగ్ వీడియోలో చూపించారు. ఏ అంతెం సాంగ్ కూడా యూ ట్యూబ్ లో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.   సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై క్రమంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగానే మహేష్ సినిమా అంటే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచాయి. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ కు రెడీ అవుతోంది. తాజాగా చిత్ర యూనిట్ 'ల్యాండ్ మార్క్ అనౌన్స్మెంట్' పేరుతో ఫ్యాన్స్ పండగ చేసుకునే ప్రకటన చేసింది. మెగాస్టార్ చిరంజీవి సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు