సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మహేష్ ని యువతులు అమితంగా ఇష్టపడతారు. తమిళ నటి పద్మజ మహేష్ కు వీరాభిమాని. 

మహేష్ నటించిన ఈ చిత్రం విడుదలైనా పద్మజ చెన్నైలోని థియేటర్స్ వద్ద మహేష్ ఫ్లెక్సీలు పూజలు చేస్తూ కనిపించేది. ఇలా ఆమెకు మహేష్ అభిమానుల్లో కూడా గుర్తింపు ఏర్పడింది. కానీ పద్మజ జీవితం విషాదాంతంగా ముగిసింది. చెన్నై తిరువట్టియూర్ లోని తన అపార్ట్ మెంట్ లో పద్మజ ఆత్మహత్య చేసుకుంది. వ్యక్తిగత జీవితం, ఆర్థిక సమస్యలే ఇందుకు కారణం అని పోలీసులు చెబుతున్నారు. 

పద్మజ వయసు 23 ఏళ్ళు మాత్రమే. చిన్నవయసులోనే ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులలో విషాదం నెలకొంది. మహేష్ బాబు అభిమానులు కూడా దిగ్బ్రాంతికి గురవుతున్నారు. తాం అపార్ట్ మెంట్ లో పద్మజ ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. 

43 ఏళ్ల పవన్ హీరోయిన్ సెక్సీ ఫోజులు.. ఈమె ఎవరో గుర్తుపట్టారా!

గత కొంత కాలంగా పద్మజ తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అదే సమయంలో ఆమెని ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. డిప్రెషన్ కు గురై ఈ కఠిన నిర్ణయం తీసుకుందని సన్నిహితులు అంటున్నారు. 

పద్మజ పలు తమిళ చిత్రాల్లో సహాయ నటి పాత్రలు చేసింది. అలాగే సీరియల్స్ లో కూడా నటించింది.