దేవిశ్రీప్రసాద్ ఆల్బమ్స్ పెద్దగా సక్సెస్ కానప్పటికీ అతడికి అవకాశాలిచ్చే కొందరు హీరోలు, దర్శకులు ఉన్నారు. సుకుమార్ మాదిరిగా కొరటాల శివ కూడా దేవితోనే మ్యూజిక్ చేయించుకునేవాడు. అలానే అల్లు అర్జున్ కూడా ఛాన్స్ ఉన్నప్పుడల్లా.. దేవినే కావాలని అడిగేవాడు.

మహేష్ కూడా ఈ మధ్య దేవి మ్యూజిక్ ఉండాలని పట్టుబడుతున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో దేవి గుర్తుండే పాటలు చేయడం లేదని అతడిపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ఒక్కొక్కరుగా అతడిని దూరం పెడుతున్నారు. చిరంజీవితో కొరటాల చేస్తోన్న సినిమాకి మొదట దేవిని తీసుకుంటారని భావించారు కానీ మణిశర్మని ఫైనల్ చేశారు.

గురూజీ పూజను వదిలేలా లేడు?

అల్లు అర్జున్ కూడా సుకుమార్ సినిమాకి దేవి వద్దని మరొకరితో మ్యూజిక్ చేయించుకుందామని సుకుమార్ కి చెప్పాడట. కానీ సుకుమార్ తన హీరోని కన్విన్స్ చేసి దేవికి ఛాన్స్ ఇచ్చాడు. 'సరిలేరు నీకెవ్వరు' పాటలకు వచ్చిన రెస్పాన్స్  ఎలా ఉన్నా కానీ సినిమా హిట్ అవ్వడంతో మహేష్ అయితే అతడిని కంటిన్యూ చేస్తాడని భావించారు.

అయితే మహేష్ తన తదుపరి సినిమాకి దేవికి బదులుగా వేరే పేర్లు వినిపిస్తున్నాయి. తమన్ ని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ అతడు బిజీగా ఉండడంతో మణిశర్మని తీసుకోమని మహేష్ సూచించాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మహేష్ కూడా దేవిని దూరం పెడుతున్నాడనే అనుకోవాలి!