సినిమా రిలీజ్ డేట్ల విషయంలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్, అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' టీమ్ పంతానికి పోయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్దలు చర్చలు జరిపి రాజీ కుదిర్చిన సంగతి తెలిసిందే. దీంతో 'సరిలేరు' జనవరి 11న, 'అల..' జనవరి 12న రావాలని నిర్ణయించారు.

ఇలా డేట్ లు మారినప్పుడు మహేష్ టీమ్ భయపడిందనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పరిస్థితి చూస్తే మహేష్ ముందుకొచ్చి మంచి పని చేశాడనిపిస్తుంది. బన్నీతో పోలిస్తే మహేష్ సినిమాలకు మార్కెట్ ఎక్కువే. పైగా 'సరిలేరు' నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దీంతో ఈ సినిమా థియేటర్లు ఎక్కువగా బ్లాక్ చేయగలిగారు.

'అల వైకుంఠపురంలో' స్టోరీ.. సైట్ లో పెట్టేసిన సెన్సార్ బోర్డ్!

'అల.. వైకుంఠపురములో' సినిమా కంటే దీనికే ఎక్కువ థియేటర్లు కేటాయించారు. పైగా ముందు రిలీజ్ అవ్వడం కూడా 'సరిలేరు'కి కలిసొచ్చినట్లైంది. శనివారం నాడు 'సరిలేరు.. నీకెవ్వరు' సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం థియేటర్లలో నింపేస్తున్నారు. 'దర్బార్'ని దాదాపుగా ఖారీ చేసేసారు.

దీంతో శనివారం పూర్తిగా 'సరిలేరు' సినిమా బాక్సాఫీస్ ని ఏలేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలకు అనుమతులు లభించడంతో మహేష్ సినిమాకి ఎదురులేకుండా పోయింది. తొంబై శాతం థియేటర్లలో ఈ సినిమాకి అదనపు షోలు వేసి, టికెట్ రేట్లు పెంచి, దాదాపు అన్ని చోటా ఫుల్స్ పడుతున్నాయి కాబట్టి సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అంచనా వేయొచ్చు.

మొదటి రోజే ఈ సినిమాకి రూ.50 కోట్ల వరకు వరల్డ్ వైడ్ షేర్ వచ్చినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే 'అల.. వైకుంఠపురములో' సినిమాకి ఈ అడ్వాంటేజ్ లేదు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా థియేటర్లలో ఉంటుంది కాబట్టి 'అల.. వైకుంఠపురములో' సినిమాకి సగం థియేటర్లే దక్కుతాయి. కాబట్టి షేర్ కూడా తక్కువగా వస్తుంది. అలా మహేష్ ముందే వచ్చి అన్ని రకాలుగా అడ్వాంటేజ్ పొందాడు.