Asianet News TeluguAsianet News Telugu

'అల వైకుంఠపురంలో' స్టోరీ.. సైట్ లో పెట్టేసిన సెన్సార్ బోర్డ్!

ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందా అని అందరూ ఎదురూ ఎదురూచూస్తున్నారు. అయితే ఊహించని విధంగా సెన్సార్ బోర్డ్ తమ సైట్ ఈ చిత్రం స్టోరీ లైన్ ని పెట్టేసింది. అయితే మన సెన్సార్ బోర్డ్ కాదు.. బ్రిటిష్ ఫిలిం సెన్సార్ సంస్థ.

Censor Board Leaked Ala Vaiumthaurramloo Story
Author
Hyderabad, First Published Jan 11, 2020, 1:44 PM IST

సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే దర్బార్, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు రెండూ రిలీజ్ అయ్యి..హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఈ పోటీలో ఉన్న "అల వైకుంఠపురంలో" రేపు (జనవరి 12న)థియేటర్లలో సందడి చేసేందుకు భారీగా సిద్దమైంది. ఇప్పటికే  ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ ..టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషనల్‌ గా మారి  బన్నీ ఫ్యాన్స్‌నే కాక సినీ ప్రేక్షకులందర్నీ అలాగే సంగీత అభిమానులు అందరినీ ఆకట్టుకుంటోంది.అలాగే ఈ చిత్రం ట్రైలర్ సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందా అని అందరూ ఎదురూ ఎదురూచూస్తున్నారు. అయితే ఊహించని విధంగా సెన్సార్ బోర్డ్ తమ సైట్ ఈ చిత్రం స్టోరీ లైన్ ని పెట్టేసింది. అయితే మన సెన్సార్ బోర్డ్ కాదు.. బ్రిటిష్ ఫిలిం సెన్సార్ సంస్థ.

సాధారణంగా బ్రిటన్ లో సినిమాని సెన్సార్ చేసేటప్పుడు స్టోరీ లైన్ ఏంటో చెప్పాలి. ... దాన్ని తన వెబ్సైటు లో అప్డేట్ చేస్తూంటారు. వారి వెబ్ సైట్  ప్రకారం... కథ ఏంటంటే.. "ఒకతను తనకి పుట్టిన బిడ్డని మార్చేస్తాడు... తన కొడుకుని ధనవంతుల తల్లి ఒడిలో వదులుతాడు, వాళ్ళ బిడ్డని తన కొడుకుగా పెంచుతాడు." అంటూ మూవీ స్టోరీ లోని అసలు గుట్టు చెప్పేసాడు. దాంతో గతంలో ప్రచారం అయిన కథ ఇదే అని తేలిపోయింది.

పాపం.. మహేష్... హిట్ టాక్ రాగానే.. ఫట్ అంటూ ట్రోల్స్

త్రివిక్రమ్ మాట్లాడుతూ.." హీరో వైకుంఠపురం అనే ఇంటికి ఎందుకు వెళ్లాడు, హీరో జీవితంలో అతడికి అదే అతిముఖ్యమైన విషయం ఎలా అయ్యింది అనేది ఈ సినిమా. ఇంటికి వైకుంఠపురం అనే పేరు ఊరికే పెట్టలేదు. ఏకంగా సినిమా టైటిల్ కూడా అదే పెట్టామంటే ఇంపార్టెన్స్ అర్థంచేసుకోవచ్చు. సినిమా చూసిన తర్వాత నా మాటలకు అర్థాలు తెలుస్తాయి," ఇలా  తన సినిమా గురించి వివరణ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా అది కూడా కొంపలు మునుగుతున్నా నిజం తప్ప అబద్దం చెప్పని వ్యక్తిగా బన్నీ నటిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఇక పూజా హెగ్డేకి చెందిన ఆఫీస్ లో బన్నీ నటిస్తున్నట్టు, పూజా తల్లిగా టబు తండ్రిగా తమిళ నటుడు జయరాం నటిస్తున్నారు.

అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు. డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్ నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).

Follow Us:
Download App:
  • android
  • ios