సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు విశేషమైన స్పందన వచ్చింది. మహేష్ కు జోడిగా తొలిసారి రష్మిక మందన నటించింది. 

అందరిని ఆసక్తికి గురిచేస్తున్న మరో అంశం ఏంటంటే.. 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎంట్రీ ఇస్తోంది. తమన్నా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇన్ని విశేషాలు ఉన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో అప్పుడే సందడి మొదలైపోయింది. 

మహేష్ బాబు కూడా ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ తన తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మహేష్ నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తన తదుపరి చిత్రం వంశీ దర్శకత్వంలో ఉంటుందని మహేష్ స్వయంగా ఖరారు చేశాడు. 

RRR టీమ్ ట్వీట్.. ఆ పాత్ర ఇంతవరకు ప్రారంభమే కాలేదా?

ఇక కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై మహేష్ స్పందించాడు. ఆ మధ్యన మేమిద్దరం కలుసుకున్న మాట వాస్తవమే. ప్రశాంత్ నీల్ కొన్ని కథలు కూడా వినిపించాడు. కానీ మా కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేను అని మహేష్ తెలిపాడు.