ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య భారీ వసూళ్ల యుద్ధమే జరిగింది. సినిమాలు రిలీజైన దగ్గర నుండి కలెక్షన్స్ కి సంబంధించి రోజుకో పోస్టర్ వదిలేవారు.

ఒక సినిమాకి మరొక సినిమా కౌంటర్ గా వ్యవహరించేది పరిస్థితి చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో అయితే ఈ కలెక్షన్స్ రచ్చ మాములుగా లేదు. ఇంత జరుగుతున్నా.. కూడా హీరోలు మాత్రం ఈ ఫేక్ కలెక్షన్స్ గొడవపై స్పందించలేదు. దర్శకనిర్మాతలు అడపాదడపా స్పందించినా.. బన్నీ, మహేష్ లు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

అమెరికాలో మహేష్ కి సర్జరీ, ఐదు నెలలు రెస్ట్!

ఇన్నాళ్లకు మహేష్ సినిమా కలెక్షన్స్ పై రియాక్ట్ అయ్యాడు. అది కూడా నర్మగర్భంగా మాత్రమే స్పందించాడు. 'చీప్ ట్రిక్స్ మేం నమ్మం. వేరే వాళ్ల వర్క్ పై నెగెటివ్ గా మాట్లాడడం మాకు తెలియదు' అన్నారు.

బాక్సాఫీస్ గెలుపు కోసం తన కెరీర్ లో ఎప్పుడూ తెరచాటు మార్గాలను అనుసరించలేదని.. తన కెరీర్ లో ఏం సాధించినా.. అది హార్డ్ వర్క్, మంచితనం, కుటుంబ సహాయం, మరీ ముఖ్యంగా అభిమానుల వలనే సాధ్యమైందని భావిస్తానని.. అంతకుమించి చెప్పడానికి ఏం లేదని అన్నారు.

మహేష్ మాటలను బట్టి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి వస్తున్న కలెక్షన్లు, తాము చెబుతోన్న ఫిగర్లన్నీ జెన్యూన్ అనే అర్ధం వచ్చేలా మాట్లాడాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ రియాక్ట్ అవుతాడేమో చూడాలి!