రీసెంట్ గా సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ హిట్ కొట్టి వెకేషన్ ని అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు మహేష్. అయితే ఆయనకు త్వరలో సర్జరీ జరగబోతోందని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మోకాలు నెప్పితో బాధపడుతున్నారు.  దాంతో ఈ నెలాఖరున సర్జరీ చేయించుకోబోతోన్నట్లు తెలుస్తోంది. సర్జరీ అనంతరం ఐదు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట.
 
శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'ఆగడు' సినిమా టైటిల్ సాంగ్  షూటింగ్ సమయంలో మోకాలు దెబ్బ తగిలింది. 2017లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అయితే డాక్టర్స్ చెప్పినట్లు రెస్ట్ తీసుకోకపోవటంతో మళ్లీ మొదటికి వచ్చింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో మరోసారి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకోబోతున్నారు. తన తదుపరి సినిమాకు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. ఏప్రియల్, మే నెలలో ఆయన హైదరాబాద్ రానున్నారు.

మహేష్ బాబు వాడే కాస్ట్లీ కార్లు ఇవే..!
 
ఇక మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. తనకు మహర్షి వంటి మరుపరాని హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు వినికిడి. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం జేమ్స్ బాండ్ తరహా క్యారక్టరైజేషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం సగంలో ప్రారంభించి వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని రిలీజ్ చేస్తారు.