సూపర్ స్టార్ మహేష్ బాబు 90 లక్షల శ్రీమంతుడయ్యాడు. సౌత్ లో సోషల్ మీడియాలో మహేష్ బాబుకి ఉన్నత ఫాలోయింగ్ మరే సెలెబ్రిటీకి లేదు. మహేష్ బాబు సైలెంట్ గా ఉండిపోయే రకం కాదు. అలాగని ఎక్కువగా హడావిడి కూడా చేయడు. తనపని తాను చేసుకుంటూ అభిమానులతో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాని ఉపయోగించుకుంటారు. 

సౌత్ లో అత్యధి ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన సెలెబ్రిటీ మహేష్ బాబే. తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 9 మిలియన్లకు(90 లక్షలు) చేరింది. ఇది సౌత్ ఇండియాలోనే రికార్డ్. దీనితో మహేష్ అభిమానులు SSMBSouthMostFollowedActor అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

మహేష్ బాబు ట్విటర్ లో ఏదైనా పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ కావాల్సిందే. మహేష్ కు ఉండే ఫాలోయింగ్ అలాటిది మరి. ఇక పేస్ బుక్ లో కూడా మహేష్ దూసుకుపోతున్నాడు. పేస్ బుక్ లో మహేష్ కు 50 లక్షలకు పైగా లైక్స్ ఉన్నాయి. 

పబ్బులో దాడి: కేటీఆర్ కు రాహుల్ సిప్లిగంజ్ రిక్వస్ట్.. హిమజ, అషు రెడ్డిల మద్దతు

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ సంక్రాంతికి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. ఇక మహేష్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ తన తదుపరి చిత్రం విషయంలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.