టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మహేష్ - అల్లు అర్జున్ సినిమాలు రెండు కూడా ఒకే ఫెస్టివల్ కి రిలీజ్ అవుతుండడంతో అభిమానుల్లోనే కాకూండా సిని ప్రముఖుల్లో కూడా ఈ బాక్స్ ఆఫీస్ యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. హీరోలిద్దరు ఎవరికీ వారు ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.  బన్నీ అల వైకుంఠపురములో - మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలపై సమానంగా అంచనాలు ఏర్పడ్డాయి.

అల్లు అర్జున్ సాంగ్స్ తో ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. రాములో రాములా సాంగ్ చిన్న పిల్లలను సైతం తెగ ఎట్రాక్ట్ చేసింది. అయితే మహేష్ మాత్రం ఆడియో పరంగా ఇంకా జనాల్లోకి సినిమాను పూర్తిగా తీసుకెళ్లలేదు. అయినప్పటికీ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయ్.  అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే బన్నీకి పోటీని ఇవ్వాలంటే ఇంకాస్త డోస్ పెంచాలని మహేష్ కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అసలు సమస్య అదేనా..?

నందమూరి అభిమానులను తనవైపు తిప్పుకోవాలని రొటీన్ ప్లాన్ అనుకుంటున్నాడు. మహేష్ కి అభిమానుల సంఖ్య గట్టిగానే ఉన్నప్పటికీ మెగా అభిమానుల సపోర్ట్ తోనే కాకుండా త్రివిక్రమ్ మ్యానియాతో బన్నీ అల..వైకుంఠపురములో రేంజ్ పెరిగింది.  దీంతో అతన్ని ఎదుర్కోవాలంటే సరిలేలు నీకెవ్వరుకి మంచి హైప్ క్రియేట్ చేయాలి. సినిమాకు అనిల్ రావిపూడి క్రేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేము.

కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నందమూరి అభిమానులను మొత్తం తన వైపుకు తిప్పుకోవాలని మహేష్ జూనియర్ ఎన్టీఆర్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరోసారి తారక్ ని స్పెషల్ గెస్ట్ గా రప్పించాలని అనుకుంటున్నారట.  గతంలోనే జూనియర్ ఎన్టీఆర్ భరత్ అనే నేను సినిమాకు ముఖ్య అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి రోటిన్ గా తారక్ మహేష్ తో కనిపించనున్నట్లు సమాచారం. ఇదే గనక నిజమైతే సంక్రాంతి ఫైట్ మరింత హీటెక్కడం కాయం.