సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఇప్పటికే విడుదల కావాలి కానీ సెన్సార్ సమస్య కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకి సెన్సార్ ఇవ్వాలంటే 90 కట్ లు చెప్పాల్సి వస్తుందని, అందువలన సెన్సార్ ఇవ్వలేమని.. కావాలంటే రివైజింగ్ కమిటీకి వెళ్లమని చెప్పేశారు.

దీంతో మేకర్స్ రివైజింగ్ కమిటీకి అప్లై చేశారు. ఆ కమిటీ వాళ్లు సినిమా చూడడానికి ఒప్పుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో దాని బట్టి రిలీజ్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా.. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఇటు తెలుగుదేశానికివ్యక్తిరేకంగా, అటు వైఎస్సార్సీపీకి ఫేవర్ గా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

యాంకర్ రవికి బిగ్ బాస్ శ్యామల ఛాలెంజ్!

అలానే ట్రైలర్ ని బట్టి కొంతవరకు కమ్మ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉంటాయని అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి మరో రకంగా ఉంది. సినిమాలో రాజకీయ వ్యవహారాలకు దీటుగా కులాల వ్యవహారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి, మరో సామాజిక వర్గాన్ని బాగా హైలైట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగా సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రాలేదని అంటున్నారు. అయితే వర్మ మాత్రం ముందు జాగ్రత్తగా చాలా సీన్లకు రెండు వెర్షన్లు చొప్పున షూట్ చేసి రెడీగా ఉంచినట్లు తెలుస్తోంది.

అవసరం అయితే వాటన్నింటినీ క్లబ్ చేసి రెండో వెర్షన్ తయారీకి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి వర్మ మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సినిమాని మాత్రం విడిచిపెట్టేలా లేడు.