టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేషనల్ లెవెల్లో కొన్ని బడా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ గా కూడా పలుమార్లు క్రేజ్ అందుకున్న మహేష్ నిత్యం యాడ్స్ తో బిజీగా ఉంటాడు. అయితే కొన్నిసార్లు మహేష్ తీసుకునే నిర్ణయాలు కమర్షియల్ డోస్ ని పెంచినట్లు టాక్ వస్తుంటుంది.

మహేష్ రేంజ్ కి తగ్గ యాడ్స్ లో కాకుండా.. చిన్న తరహా సబ్బు - నూనె కంపెనీలకు కూడా ప్రచారాలు చేస్తుంటాడు. అయితే తన సినీ కెరీర్ లో అప్పుడపుడు తన ఫ్యామిలీని హైలెట్ చేసే మహేష్ ఈ సారి కమర్షియల్ డోస్ మరింతగా పెంచాడనిపిస్తోంది. సినిమాల పరంగా వారిని హైలెట్ చేయడం అందంగా ఉంటుంది. అన్ని ఈ సారి హైలెట్ చేయడంలో మహేష్ అతిగా ఆలోచించినట్లు టాక్ వస్తోంది.  రీసెంట్ గా ఓ కంపెనీకి చేసిన యాడ్ లో నమ్రతతో పాటు కూతురు, కొడుకుతో కూడా యాక్టింగ్ చేయించాడు.

మహేష్ తీరుపై కాస్త మిక్సిడ్ టాక్ వస్తోంది. ఏకంగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక యాడ్ లో ప్రజెంట్ చేసిన మహేష్ ఓ వర్గం ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చినప్పటికీ కొందరి పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం కొంత ఎబ్బెట్టుగా చేశాడనే కామెంట్స్ వస్తున్నాయి.   సాధారణంగా కొంత మంది స్టార్ హీరోలు యాడ్స్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడరు. రజినికాంత్ - పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అసలు వాటి జోలికే వెళ్ళరు.

గతంలో చేసినప్పటికీ కొంతమంది ఇప్పుడు ఆ దారిలో డబ్బులు సంపాదించడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాన్ని కమర్షియల్ యాడ్స్ కోసం వాడటం అనేది కాస్త విమర్శలకు బూస్ట్ ఇచ్చినట్లే.  ఇప్పుడు మహేష్ ఎవరు చేయని స్టార్ హీరోలా.. ఫ్యామిలి మొత్తాన్ని యాడ్ లో నటింపజేసి నెగిటివ్ కామెంట్స్ కి తావిచ్చేలా రిస్క్ చేశాడానిపిస్తోంది.

అయినా ఎవరెన్ని కామెంట్స్ చేసినా మహేష్ తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్లు ఎవరిని నొప్పించకుండా జీవిస్తున్నాడు. పైగా కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నాడు. సో మహేష్ ఎంత కమర్షియల్ అయినా కరెక్ట్ గానే ఉంటాడనే విషయాన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవారు దృష్టిలో ఉంచుకుంటే బెటర్.

read also: సరిలేరు నీకెవ్వరు దీపావళి ట్రీట్.. ఎవరు ఊహించనిది?