చాలా రోజుల తరువాత ఫుల్ కామెడీ ఎంటర్టైన్ రోల్ తో మహేష్ అలరించడానికి రెడీ అవుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

ప్రస్తుతం దర్శకుడు లాస్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.  ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ ట్రీట్ ని ఈ దీపావళికి ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఎలాంటి కిక్ ఇస్తుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం విజయశాంతి లుక్ ని రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

చాలా రోజుల తరువాత మేకప్ వేసుకున్న విజయశాంతి ఏ విధంగా కనిపిస్తారు అనేది ఆసక్తిని కలిగిస్తోంది.  సరిలేరు నీకెవ్వరు లో విజయశాంతి పాత్ర స్ట్రాంగ్ గ అంటుందని పాజిటివ్ మ్యానర్ లో దర్శకుడు ఆమె పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. దీపావళికి ఆ ఒక్క లుక్ తో సినిమాపై అంచనాలు డోస్ పెంచాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది.

దిల్ రాజు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నారు.