సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫోటోలు దిగాలనుకుంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు ఆన్ లైన్ లో ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు అభిమానులు గాయపడ్డారు. బౌన్సర్లు తమతో దురుసుగా ప్రవర్తించారని.. తమపై చేయి చేసుకున్నారని.. అభిమానులను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ తో ఫోటో తీసుకోవాలని ట్రైన్ లో సీట్లు లేకపోయినా రాత్రంతా ప్రయాణం చేసి మరీ వచ్చామని అలాంటిది తమని కొట్టి తరిమేశారని అభిమానులు వాపోతున్నారు.

2019లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన చిత్రాలు.. 'సైరా' కళ్ళు చెదిరే రికార్డ్

అయితే మహేష్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ తో ఫోటోలు తీసుకోవడం కోసం మహేష్ బాబు డబ్బు తీసుకున్నాడని అర్ధం వచ్చేలా సదరు అభిమాని పోస్ట్ పెట్టాడు. నిజానికి మహేష్ తో ఫోటోలు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా కొన్ని పాస్ లను డిజైన్ చేశారు.

వాటి ఖరీదు 500 నుండి 2000 వరకు ఉన్నాయట. మహేష్ తో ఫోటో అనగానే ఆ పాస్ లను ఎగబడి కొన్నారట అభిమానులు. తీరా మహేష్ దగ్గరకి వస్తే తమని కుక్కలను కొట్టినట్లు కొట్టారని.. కనీసం మహేష్ ని కలవనివ్వలేదని మండిపడుతున్నారు. కొందరు లేడీ ఫ్యాన్స్ పై కూడా బౌన్సర్లు విరుచుకుపడ్డారని చెబుతున్నారు.

డబ్బులు పెట్టి పాస్ లు కొంటే మోసం చేయడమే కాకుండా తమని అవమానించారంటూ వాపోతున్నారు. మహేష్ బాబు కూడా తన ఫ్యాన్స్ ని సరిగ్గా ట్రీట్ చేయలేదని ఆరోపిస్తున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫోటోషూట్ ని ప్లాన్ చేశారు. కానీ ఇది కాస్త నెగెటివ్ ఇమేజ్ ని తీసుకొచ్చింది.