టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ ప్రమోషన్స్ తో సాలిడ్ గా సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బన్నీ "అల.. వైకుంఠపురములో" పాటలతో హడావుడి క్రియేట్ చేయగా.. సరిలేరు నీకెవ్వరు పోస్టర్స్ తో మహేష్ కాస్త సందడి చేశాడు.. అయితే ప్రమోషన్స్ రేస్ లో మాత్రం బన్నీ ముందున్నాడని చెప్పవచ్చు.

విడుదలైన రెండు పాటలకు మంచి క్రేజ్ దక్కింది. ఇక పోటీ తీవ్రత [పెంచేందుకు మహేష్ డైరెక్ట్ గా టీజర్ తో ఎటాక్ చేయనున్నాడు. ఈ వీక్ లో టీజర్ ని రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ నుంచి మహేష్ రెగ్యులర్ ప్రమోషన్ బరిలోకి దిగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్న మహేష్ సరిలేలు నీకెవ్వరు సినిమాకు అసలైన ప్రమోషన్స్ ని మాత్రం కాస్త ఆలస్యంగానే మొదలుపెట్టనున్నాడట.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి ఆ సినిమాపై కూడా అంచనాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి, రెండు సినిమాలు ఒకేరోజు వస్తుండడంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు మ్యాటర్ లోకి వస్తే సంక్రాంతికి ఒకే ఫ్రేమ్ లో మహేష్ బన్నీ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంటే బుల్లితెరపై రెండు సినిమాలకు సంబందించిన ప్రమోషన్స్ కలిసి చేయాలనీ బన్నీ మహేష్ ఒకటికాబోతున్నట్లు టాక్.

read also సంక్రాంతి ఫైట్: మంచివాడు మొండిగా ఫిక్స్ అయ్యాడు

ఈ స్పెషల్ ప్రమోషన్స్ కి ముందు [ప్లాన్ వేసింది దర్శకుడు త్రివిక్రమ్ అని టాక్. మహేష్ బన్నిలతో స్పెషల్ గా చిట్ చాట్ చేయాలనీ త్రివిక్రమ్ ఒక ప్రమోషన్స్ టాస్క్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబందించిన షూటింగ్ ఫైనల్ పార్ట్ కి చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.