టాలీవుడ్ లో సంక్రాంతి కి విడుదల కానున్న సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు ఒకరిని మించి మరోకోరు సై అంటున్నారు. సంక్రాంతి కోసం ఒక ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక పొంగల్ బరిలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా దిగుతున్నాడు.

షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ - బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం బెదరకుండా అదే సమయంలో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. జనవరి 15న ఎంత మంచివాడవురా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు.

గత కొంత కాలంగా సినిమా వాయిదా పడనుంది అనే రూమర్స్ కి ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.  సంక్రాంతికి పోటీ అవసరమా అని కళ్యాణ్ రామ్ కి  కొన్ని సలహాలు వచ్చినప్పటికీ అప్పుడే సినిమాను రిలీజ్ చేయాలనీ మొండిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు స్టయిలిష్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రానున్నట్లు నిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు.  ఇక మహేష్ బాబు - అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ కూడా అప్పుడే రానున్నట్లు ఫిక్స్ చేశారు. ఈ రెండు సినిమాలైతే జనవరి 12న రానున్నట్లు అఫీషియల్ డేట్ ని ఎనౌన్స్ చేశారు.

మళ్ళీ మారే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో మధ్యలో ఎవరు వచ్చినా ఇబ్బంది తప్పదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం వెనుకడుగు వేయకుండా సంక్రాంతికి మన సినిమా రిలీజ్ కావాల్సిందే అని దర్శకనిర్మాతలను ఒప్పించినట్లు సమాచారం. మరి నందమూరి హీరో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.