‘మ‌హాన‌టి’వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న చిత్రం‘జాతిర‌త్నాలు’. ‘మ‌హాన‌టి’  దర్శ‌కుడు నాగ్అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నారు. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ చిత్రంలో జాతి రత్నాలుగా న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ  జైలు ఖైదీల దుస్తుల్లో క‌న‌ప‌డుతున్నారు. 420, 210, 840 వారి నెంబ‌ర్స్‌గా క‌న‌ప‌డుతున్నాయి. మార్కెట్లో కామెడీకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పేరు తెచ్చుకున్న న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై మంచి క్రేజ్ నెల‌కొంది.

విజయ్ 'బిగిల్' ట్విట్టర్ రివ్యూ

మరీ ముఖ్యంగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’ సినిమాతో హీరోగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సొంతం చేసుకున్న న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తూండటం ప్లస్ పాయింట్. అలాగే  ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కాంబినేష‌న్ ‘బ్రోచెవారెవురురా’మంచి హిట్ అయ్యింది. సినిమా ఇప్ప‌టికే 75 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ర‌ధ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. సిద్ధం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీశ‌ర్మ‌, వి.కె.న‌రేశ్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, మిర్చి కిర‌ణ్, గిరిబాబు, మహాన‌టి ఫేమ్ మ‌హేష్‌ తదితరులు.