Asianet News TeluguAsianet News Telugu

మహానటి యాక్టర్ మరో మల్టీస్టారర్..  టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్

మలయాళం స్టార్ హీరో మమ్ముంటి తనయుడైన దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర చేసిన ఇట్టే క్లిక్కవుతుంది. ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. మహానటిలో జెమిని గణేశన్ పాత్రని తనదైన శైలిలో ప్రజెంట్ చేసిన ఈ కుర్ర హీరో మంచి ప్రశంసలు అందుకున్నాడు.

mahanati actor dulquer salmaan another multi starrer
Author
Hyderabad, First Published Oct 28, 2019, 11:55 AM IST

మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళం స్టార్ హీరో మమ్ముంటి తనయుడైన దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర చేసిన ఇట్టే క్లిక్కవుతుంది. ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

mahanati actor dulquer salmaan another multi starrer

మహానటిలో జెమిని గణేశన్ పాత్రని తనదైన శైలిలో ప్రజెంట్ చేసిన ఈ కుర్ర హీరో మంచి ప్రశంసలు అందుకున్నాడు.  ఇక ఆ  సినిమా తరువాత దుల్కర్ మరో తెలుగు సినిమా చేయలేదు. కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో నో చెప్పేశాడట. ఇక రీసెంట్ గా ఒక తమిళ్ సినిమాను రీమేడ్ చేయడానికి ఒప్పుకున్న దుల్కర్ ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట.

also read: మహానటి వల్లే సినిమాలు చేయట్లే: కీర్తి సురేష్

1996లో విక్రమ్ - అజిత్ నటించిన ఉల్లాసం అనే సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.  అయితే ఆ సినిమాను మళ్ళీ తెరకెక్కించేందుకు కథ ఒరిజినల్ దర్శకుడు జెడి - జెర్రీ సిద్ధమయ్యారు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆ లవ్ స్టోరీని సరికొత్తగా తెరకెక్కించాలని విక్రమ్ ప్రభు - దుల్కర్ సల్మాన్ లను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దుల్కర్ సల్మాన్ ఆ ఆ కథను తెలుగులో కూడా విడుదల చేసే విధంగా ముందే ఒక ప్లాన్ వేసుకోనున్నట్లు సమాచారం. మరి ఈ మహానటి హీరో ఆ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

mahanati actor dulquer salmaan another multi starrer

Follow Us:
Download App:
  • android
  • ios