పోలింగ్, కౌంటింగ్ నాటి సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు (krishna mohan) ప్రకాశ్ రాజ్ గురువారం లేఖ రాశారు. దీనిపై కృష్ణమోహన్ స్పందించారు. ఎన్నికల సీసీ ఫుటేజ్ భద్రంగానే వుందని ఆయన వెల్లడించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (maa elections) ముగిసినా ఇంకా సభ్యుల మధ్య వివాదాలు, విమర్శలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటంత లేదు. ఎన్నికల్లో అవకతకవలు జరిగాయని.. రౌడీయిజం ఎక్కువైందని ప్రకాశ్ రాజ్ (prakash raj) సంచలన ఆరోపణలు చేశారు. ఒకానొక దశలో మాకు పోటీగా ఆయన ఆత్మ పేరుతో మరో అసోసియేషన్ పెడతారని కూడా ప్రచారం జరిగింది. అయితే వాటిని ప్రకాశ్ రాజ్ ఖండించారు. అదే సమమంలో తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది చేత రాజీనామా చేయించి దుమారం రేపారు. తాజాగా పోలింగ్, కౌంటింగ్ నాటి సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు (krishna mohan) ప్రకాశ్ రాజ్ గురువారం లేఖ రాశారు. దీనిపై కృష్ణమోహన్ స్పందించారు. ఎన్నికల సీసీ ఫుటేజ్ భద్రంగానే వుందని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారం ప్రకాశ్ రాజ్‌కు సీసీ ఫుటేజ్ ఇస్తామని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.
అంతకుముందు ప్రకాష్ రాజ్ maa election అధికారికి లేఖ రాశారు. `మా` ఎన్నికల పోలింగ్ రోజు, పోలింగ్ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన సీసీ ఫుటేజీని తమకి ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. ఆ లేఖని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆయన చెబుతూ `మా` ఎన్నికల్లో జరిగిన అనేక దురదృష్టకర సంఘటనలకు మీరు సాక్షులు. ఆ రోజు మోహన్‌బాబు (mohan babu), మాజీ మా అధ్యక్షుడు నరేష్ (naresh) ల వికృతి, సామాజిక వ్యతిరేక ప్రవర్తనని మేం చూశాం. వారు మా సభ్యులను దూషించారు. బెదిరించారు. శారీరకంగా దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వారి అనుచరులను అనుమతించారు. దాంట్లో మీరు మీ విచక్షణాధికారాలను ఉపయోగించారని అనుకుంటున్నా.
Also Read:మా` పోలింగ్ రోజు మోహన్‌బాబు దాడి చేశారు.. సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారికి ప్రకాష్‌రాజ్ లేఖ
కొన్ని విజువల్స్ మీడియాకి లీక్ అయ్యారు. `మా` ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలు ప్రజల దృష్టిలో మాకు నవ్వు తెప్పించాయి. తెలిసిన కొన్ని ముఖాల ప్రవర్తన పట్ల అసహ్యంగా ఉంది. `మా` సభ్యులు కూడా ఈ నివేదికల గురించి నిజం తెలుసుకోవాలనుకున్నారు. పోలింగ్ సమయంలో ఆ కేంద్రంలో సీసీ కెమెరాల వినియోగం గురించి మాట్లాడుకున్నాం. అందులో ప్రతిదీ రికార్డ్ చేశారని నేను నమ్ముతున్నా. కాబట్టి మాకు సీసీటీవీ ఫుటేజ్‌ని ఇవ్వమని కోరుతున్నా. ఎన్నికలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందడం మన ప్రజాస్వామ్య హక్కు. ఒక పోలింగ్ అధికారిగా అన్ని రికార్డులను కనీసం మూడు నెలలు భద్రపరడం మీ విధి. అనేక సుప్రీం కోర్ట్ (supreme court) తీర్పులు కూడా పోలింగ్ అధికారులను రికార్డులను భద్రపరమని ఆదేశించాయి.
కాబట్టి సాధ్యమైనంత త్వరగా మాకు సీసీ టీవీ ఫుటేజ్‌ని ఇవ్వమని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నా. మీరు వెంటనే చర్య తీసుకోకపోతే, ఫుటేజ్ తొలగించబడుతుందని, ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలున్నాయని భయంగా ఉంది. దయజేసి ఈ లేఖని అంగీకరించండి` అని తెలిపారు ప్రకాష్‌రాజ్. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు బయటకు వస్తాయని, ప్రజలకు తెలుస్తుందని వెల్లడించారు ప్రకాష్‌రాజ్.
