అసలే ఫ్లాపుల్లో ఇరుక్కుపోయిన రవితేజకి ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. తను ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన 'డిస్కో రాజా' సినిమాకి సరైన థియేటర్లు దొరకడం లేదు. దానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్. ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

'సరిలేరు', 'అల..' ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ నుండి కదలకపోవడంతో రవితేజకి థియేటర్ల సమస్య ఎదురవుతోంది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని భారీ రేంజ్ లో రిలీజ్ చేయాలని అటు నిర్మాతకు, ఇటు హీరోకి ఉన్నప్పటికీ థియేటర్లు మాత్రం లేవు.

'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల మధ్య పోటీ ఇంకా కొనసాగుతుండడంతో రవితేజ 'డిస్కో రాజా'కి సరైన థియేటర్లు దొరకలేదు. థియేటర్స్ కౌంట్ పరంగా ఏపీ, నైజాంలో ఇప్పటికీ ఈ రెండు సినిమాలదే హవా.. ఒక్క సెంటర్ నుండి కూడా సినిమాని తప్పించడానికి ఎవరూ ఇష్టపడడం లేదు.

నిర్మాతలిచ్చిన చెక్కులు చించేశా.. హీరో రవితేజ కామెంట్స్!

దీంతో డిస్కోరాజాకి అనుకున్న స్థాయిలో స్క్రీన్స్ దొరకడం లేదు. పైగా.. శుక్రవారం నాడు 'స్ట్రీట్ డాన్సర్3' అనే బాలీవుడ్ సినిమా రిలీజవుతోంది. ఈ సినిమా కోసం చాలా రోజుల క్రితమే కొన్ని మల్టీప్లెక్స్ లను బుక్ చేశారు.

ప్రస్తుతానికి 'డిస్కోరాజా'కి తెలంగాణలో వంద స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్ లో 160వరకు స్క్రీన్స్ మాత్రమే దొరికాయి. అసలే సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజకి థియేటర్ల సమస్య ఎదురవుతోంది. సినిమాకి హిట్ టాక్ వస్తే గనుక థియేటర్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరేం జరుగుతుందో చూడాలి!