గత కొంతకాలంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా కూడా డిజాస్టర్ అయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకొని విలక్షణ దర్శకుడు వీఐ ఆనంద్ రూపొందించిన 'డిస్కో రాజా' సినిమాలో నటించాడు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రవితేజ గురించి కొంతకాలంగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రూటు మార్చిన హీరోలు.. హిట్టు కొట్టేలా ఉన్నారు!

రెమ్యునరేషన్ విషయంలో రవితేజ ఎక్కడా రాజీ పడడని.. చాలా మొండిగా ప్రవర్తిస్తాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన రవితేజ క్లారిటీ ఇచ్చారు. తాను ఎంత పారితోషికానికి అర్హుడో అంతే రెమ్యునరేషన్ తీసుకుంటానని తెలిపారు.

మీకు ఇచ్చే జీతం 1000 రూపాయలు అయినప్పుడు 800 మాత్రమే ఇస్తే ఊరుకుంటారా..? అని ప్రశ్నించాడు. ఒకవేళ తను అంత మొండివాడినే అయితే తన కెరీర్ ఇంతదాకా వచ్చుండేది కాదని, ఇన్ని చిత్రాల్లో నటించి ఉండేవాడిని కాదని అన్నారు.

కేవలం మూడు సందర్భాల్లో మాత్రం పారితోషికం తీసుకోలేదని.. తను నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో ఫైనల్ పేమెంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదని.. నిర్మాతలు చెక్కులు ఇచ్చినా కూడా వాటిని చించేశానని అన్నారు.