టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. ఫేమస్ కావడానికో, వార్తల్లో నిలవడానికో కొంతమంది సోషల్ మీడియాని ఆయుధంగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామజిక మాధ్యమాల్లో పిచ్చి వాగుడు వాగే కొందరిని చూస్తూనే ఉన్నాం. 

ఎవరో ఒక సెలెబ్రిటీని టార్గెట్ చేస్తూ, వారిపై లేనిపోని కామెంట్స్ చేస్తూ పబ్బం గడుపుకుంటుంటారు. అలాంటి వారి జాబితాలోకి శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి చేరాడు. అతడు ఓ యూట్యూబ్ ఛానల్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. ఇతడి పిచ్చి పరాకాష్టకు చేరిందా అన్నట్లుగా.. సునిశిత్ లావణ్యపై కామెంట్స్ చేశాడు. 

తాను, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నామని, ఆమె తన భార్య అని చెప్పుకున్నాడు. కాకపోతే తాము ప్రస్తుతం విడిపోయి ఉన్నామని అన్నాడు. మా ఇద్దరిది సీక్రెట్ మ్యారేజ్. ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి ఫోటోలు కూడా తీశారు. కాయాన్ని మేమిద్దరం విడిపోవడం వల్ల ప్రస్తుతం ఆ ఫోటోలు లేవు అని చెప్పాడు. 

ఇతగాడు చెప్పేది సోదే అని అందరికి తెలిసినప్పటికీ.. ఈ వ్యాఖ్యల వల్ల లావణ్య వార్తల్లోకెక్కింది. తన ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యేలా  ఇతడి కామెంట్స్  అవుతుండడంతో లావణ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ లని ఆశ్రయించింది. సునిశిత్ పై కేసు నమోదు చేసింది. 

మహేష్ హీరోయిన్ కు బూతు మెసేజ్ లు...కారణం అదే

ఇదిలా ఉండగా సినిమాల విషయానికి వస్తే.. లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ సరసన ఏ1 ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ లో కీలక పాత్రలో నటించబోతోంది అంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి.