అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా యూపీ భామ లావణ్య త్రిపాఠి. కెరీర్ మొదలుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా బేబీ ఇంకా స్టార్ హీరోయిన్ గా అడ్జస్ట్ కాలేకపోతోంది. ఇన్నేళ్లలో 15కి పైగా డిఫరెంట్ సినిమాల్లో నటించింది. కానీ అవేవి కూడా కలిసి రాలేదు. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో సక్సెస్ అందుకుంది.

read also: హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్,. ఇప్పుడేంత? (రూ.400 నుంచి 30కోట్లవరకు)   

భలే భలే మగాడివోయ్ సినిమాతో కూడా కాస్త సందడి చేసినట్లు కనిపించింది.  కానీ ఆ సంతోషంతో అమ్మడు ఎక్కువ కాలం నిలవలేకపోయింది. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుండడంతో స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వలేకపోయింది. మిస్టర్ - రాధ - యుద్ధం శరణం అలాగే ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలు దారుణంగా దెబ్బకొట్టాయి. గత ఏడాది వచ్చిన ఇంటిలిజెంట్ తో పాటు అంతరిక్షం కూడా ప్లాప్ కావడంతో బేబీకి అవకాశాలు తగ్గిపోయాయి.

 

అయితే ఇప్పుడు తన ఆశలన్నీ అర్జున్ సురవరంపైనే పెట్టుకుంది. కానీ ఆ సినిమా బేబీకి బూస్ట్ ఇస్తుందన్న నమ్మకం లేదు. సినిమా రిలీజ్ కావడానికే నానా తంటాలు పడుతోంది. గత ఐదారు నెలల నుంచి సినిమా రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఇక మొత్తానికి నిఖిల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకొని సినిమాను ఆడియెన్స్ ముందుకు తేవడానికి సిద్దమయ్యాడు.  ఈ నెల 29న సినిమా రిలీజ్ కాబోతోంది.

మెగాస్టార్ సాయంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచి హైప్ తేవడానికి ప్లాన్ చేసుకున్నారు. సినిమా హిట్టవ్వాలని నిఖిల్ తన శక్తి మేరకు కష్టపడుతున్నాడు. అయితే ఈ సినిమా రిజల్ట్ పై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది మాత్రం హీరోయిన్ లావణ్యనే.. సినిమా సక్సెస్ అయితే బేబీ మళ్లీ నిలదొక్కుకుంటుంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.