తమిళనాడులో ఇళయదళపతి విజయ్ కేంద్రంగా సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే విజయ్ పై ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇతి రైడ్స్ జరిగినప్పటి నుంచి తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విజయ్ కి మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 

ప్రస్తుతం విజయ్ మాస్టర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నైవేలీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఐటీ దాడులకు కారణం బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే అని విజయ్ ఫ్యాన్స్ భావిస్థున్న సంగతి తెలిసిందే. 

అది బోయపాటినే అడగండి.. 'వరల్డ్ ఫేమస్ లవర్' బ్యూటీ కామెంట్స్!

ఇలాంటి తరుణంలో బిజెపి కార్యకర్తలు విజయ్ చిత్ర షూటింగ్ ని అడ్డుకుంటున్నారని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బిజెపికి వ్యతిరేకంగా షూటింగ్ స్పాట్ లోనే ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. 

గనుల్లో హీరో విజయ్ 'మాస్టర్' షూటింగ్.. దాడికి బీజేపీ ప్రయత్నం!

దీనితో విజయ్ షూటింగ్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మెర్సల్ చిత్రంలో విజయ్ సంధించిన పొలిటికల్ పంచ్ లపై అప్పట్లో తీవ్ర వివాదం నెలకొంది. ఈ చిత్రం ద్వారా విజయ్ బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడనే ప్రచారం జరిగింది. 

విజయ్ పై ఐటీ రైడ్స్.. అజిత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!