ఇద్దరమ్మాయిలతో చిత్రంలో గ్లామర్ తో ఆకట్టుకుంది కేథరిన్. సరైనోడు చిత్రంలో లేడీ ఎమ్మెల్యేగా మెప్పించింది. రుద్రమదేవి చిత్రంలో కామియో రోల్ లో నటించింది. అందం అభినయం ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం కేథరిన్ విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించింది. 

ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కేథరిన్ ప్రస్తుతం ఈ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకుని ఉంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో కేథరిన్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఓ ఇంటర్వ్యూలో కేథరిన్.. బాలయ్య, బోయపాటి చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

త్వరలో బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేథరిన్ పేరుని పరిశీలించారు. కానీ కేథరిన్ అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై కేథరిన్ స్పందించింది. 

నడుము సొగసుతో శ్రీయ అందాల విందు.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!

నేను బోయపాటి, బాలయ్య చిత్రంలో నటిస్తున్నానని చాలామంది చెప్పుకుంటున్నారు. దీని గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక్కటే చెబుతున్నా. నేను బాలయ్య సినిమాలో నటిస్తున్నానో లేదో తెలియాలంటే బోయపాటినే అడగండి అని కేథరిన్ సమాధానం ఇచ్చింది. 

గనుల్లో హీరో విజయ్ 'మాస్టర్' షూటింగ్.. దాడికి బీజేపీ ప్రయత్నం!