దగ్గుబాటి రానా ప్రస్తుతం 'విరాటపర్వం' అనే సినిమాలో నటిస్తున్నాడు. నిజానికి నిన్నటినుండి రానా ఈ సినిమా సెట్స్ పైకి రావాలి. అతడి కోసం చిత్రబృందం దాదాపు నలభై రోజులుగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలైన చాలా రోజులు అవుతుంది. రానా లేకపోయినా షూటింగ్ జరిపారు. సాయిపల్లవి పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేశారు.

కానీ ఇకపై రానా లేకుండా షూటింగ్ నిర్వహించడం సాధ్యం కాదు. రానా మాత్రం అందుబాటులో లేడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రానా మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ఆ లెక్కన చూసుకుంటే డిసంబర్ 1వరకు రానా 'విరాటపర్వం' సెట్స్ పైకి వచ్చే అవకాశాలు లేవు.

వాళ్లు మా ఫోన్లు లాగేసుకున్నారు.. ఎస్పీబీ కామెంట్స్!

చాలా కాలంగా రానా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు. దీనికి సంబంధించిన ఆపరేషన్ అమెరికాలో జరిగింది. ఆ సర్జరీ నుండి కోలుకుంటున్న రానా ఇటీవల ఇండియా వచ్చారు. కానీ హైదరాబాద్ కి మాత్రం రాలేదు. ముంబైలో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మరికొన్ని రోజుల పాటు రానా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.

దీంతో సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా.. రానా మాత్రం తన ఆరోగ్యానికి సంబంధించి వస్తోన్న వార్తల్లో నిజం లేదని, తన నుండి  అధికార ప్రకటన వచ్చే వరకు దేన్నీ నమ్మకండి అంటూ అభిమానులకుచెబుతున్నారు. ఇక 'విరాటపర్వం' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించబోతున్నారు.

1980ల్లో తెలంగాణ పల్లెల్లో జరిగిన నక్సలిజంను నేపథ్యంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. వరంగల్ జిల్లాలో ఓ పల్లెలో జరిగిన యధార్ధ  సంఘటనకు ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో రానా క్యారెక్టర్ పేరు 'రవన్న'. పాత్ర ప్రకారం రానా మోస్ట్ ఎగ్రెసివ్ గా కనిపించబోతున్నారు.