'బాహుబలి' సినిమాతో ప్రభాస్ ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ అడ్వాంటేజ్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. 'బాహుబలి' తరువాత ప్రభాస్ నటించిన 'సాహో' ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. 

ప్రభాస్ ఇమేజ్ ని వాడుకోవాలనే ఉద్దేశంతో కథకు అవసరం లేకపోయినా.. సినిమా స్కేల్, కాన్వాస్ పెంచేసి అవసరం లేని హంగులు జోడించారు.అవసరానికి మించి ఖర్చు చేశారు. ఈ విషయంలో 'సాహో' తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీంతో ప్రభాస్ తన తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పలేదు.

Bigg Boss 3: హౌస్ లో యాంకర్ సుమ రచ్చ!

'సాహో' దెబ్బకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు ప్రభాస్. 'సాహో' విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాల్సిన ప్రభాస్ రెండు నెలలకు పైగా బ్రేక్ తీసుకున్నాడు. అంతకంటే ముందు ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ అయిన తరువాత ఆరు నెలలకు పైగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో రాధాకృష్ణ కుమార్ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దారు.

'సాహో' సినిమా రిలీజైన తరువాత అలర్ట్ అయిన చిత్రబృందం బడ్జెట్ ని తగ్గించుకొని, ప్రొడక్షన్ డిజైన్ మార్చి, స్క్రిప్ట్ ని కూడా కొంతమేర మార్చుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరిమితులు పెట్టుకొని సినిమా తీయాలని యువి క్రియేషన్స్ అధినేతలు, కృష్ణంరాజు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమా స్క్రిప్ట్, మేకింగ్ విషయంలో కరెక్షన్లు చేసుకొని, కొత్త షెడ్యూల్ ని నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

ఇంతకముందు యూరప్ లో జరిగిన ఇరవై రోజుల షూటింగ్ లో సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. మరి వాటిని ఉంచుతారా..? తీసేస్తారా..? అనే విషయంలో క్లారిటీ లేదు వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.