టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం పౌరాణిక సినిమాను సెట్స్ పైకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. సినిమాను ఒక విజువల్ వండర్ గా భారీ స్థాయిలో తెరకెక్కించాలని నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా పౌరాణిక కథను సరికొత్త ఫార్మాట్ లో డిజైన్ చేస్తున్నారు.

దాదాపు బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొత్తం ఒకేసారి సెట్ చేసుకోవాలని గుణశేఖర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.  ఒక్కసారి సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే ఏ మాత్రం ఆగకూడదని షెడ్యూల్స్ ని సెట్ చేసుకుంటున్నారు. ఇకపోతే త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సినిమాకు సంబందించిన గ్రౌండ్ వర్క్ ఓ కొలిక్కి రావడంతో దర్శకుడు భారీ టీమ్ ను సెట్ చేసుకుంటున్నాడు.

సహాయ దర్శకులకు కావాలని ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు.  ముందుగానే హిరణ్యకసిప టైటిల్ ను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ బాబు ఒక వివరణ ఇచ్చారు. రానా హిరణ్యకసిప సినిమాను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కించాలని  ప్లాన్ చేస్తున్నాడట.

తమ స్టూడియోలోనే కాకుండా లండన్ కు సంబందించిన ప్రొడక్షన్ హౌస్ లలో కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా విఎఫ్ఎక్స్ సినిమాలంటే రానాకీ బాగా ఇష్టమని చెప్పిన సురేష్ బాబు త్వరలోనే ఆ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించేలా నిర్మించనున్నట్లు తెలియజేశారు.

also read: రానా 'హిరణ్యకశిప': ఈ షాకింగ్ న్యూస్ నిజమేనా?