ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వేణుశ్రీరామ్ కాంబినేషన్ లో హీరో బన్నీ చేయాల్సిన సినిమా 'ఐకాన్'. ఈ సినిమాను అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే పక్కన పెట్టేశారు. ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కానీ బన్నీకి సన్నిహితుడు, గీతాఆర్ట్స్ లో కీలక సభ్యుడు అయిన బన్నీ వాస్ మాత్రం సినిమా ఆగిపోలేదని అంటున్నారు. కేవలం ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు తప్ప, పూర్తిగా క్యాన్సిల్ చేయలేదని వెల్లడించారు.

ప్రభాస్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!

బన్నీకి ఆ కథ చాలా నచ్చిందని, తాను ఎప్పుడో అప్పుడు గ్యాప్ చూసుకొని సినిమా చేస్తానని, ఆ కథ తన కోసం అలానే ఉంచాలని వేణుశ్రీరామ్ ని బన్నీ కోరారని బన్నీ వాస్ వెల్లడించారు. నటుడిగా సంతృప్తి ఇచ్చి, మంచి పేరు తీసుకువచ్చే కథ అది అని, అందుకే దాన్ని ఎప్పటికైనా బన్నీ చేస్తారని ఆయన అన్నారు.

నిజానికి కథ అధ్బుతంగా నచ్చే బన్నీ కొన్ని నెలల క్రితం ఆ సినిమాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాదిరిగా ప్రకటించారు కానీ ఎందుకో సడెన్ గా పక్కన పెట్టారు. అయితే 'ఐకాన్' సినిమాలో కమర్షియల్ అంశాల పాళ్లు తక్కువ ఉన్నాయని, అందుకే తాత్కాలికంగా ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇది ఇలా ఉండగా.. 2022 వరకు బన్నీ డైరీ ఫుల్ అయిపోయిందని బన్నీ వాస్ తెలిపారు. సుకుమార్, మురుగదాస్ సినిమాలు వరుసగా ఉంటాయని అన్నారు. ఈ రెండు  సినిమాలతో మహా అయితే 2020 పూర్తవుతుంది. మరో రెండేళ్ల వరకు బన్నీ బిజీ అంటే మరి డేట్లు ఎవరికి ఇచ్చినట్లో.. మధ్యలో సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.