యాంకర్ గా ఎన్నో షోలు చేసిన శ్యామల.. ఆ తరువాత నటిగా మారి కొన్ని సినిమాలు చేశారు. గతేడాది బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొని జనాలకు మరింత దగ్గరయ్యారు. ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు హీరోయిన్లుగా మారి సినిమాలు చేశారు. అదే విషయాన్ని శ్యామల వద్ద ప్రస్తావించగా.. తనకు హీరోయిన్ గా సినిమాలు చేయడం ఇష్టం లేదని చెప్పింది.

హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేయడమంటే చాలా బాధ్యతతో కూడుకున్న పని అని.. ఆడియన్స్ గ్లామర్ ఎక్స్పెక్ట్ చేస్తారని.. దాన్ని మైంటైన్ చేయలేనని చెప్పింది. తనకు తిండి, నిద్ర చాలా ముఖ్యమని.. హీరోయిన్ అయితే ఈ రెండింటినీ త్యాగం చేయాలని.. అది తన వల్ల కాదని చెప్పింది.

'నిశ్శబ్దం'.. అనుష్క ఎంత తీసుకుందో తెలుసా..?

తనకు అసలు హీరోయిన్ అవ్వాలనే ఆసక్తే లేదని.. భవిష్యత్తులో హీరోయిన్ ఛాన్స్ వచ్చినా చేయనని స్పష్టం చేసింది. సీరియల్స్, సినిమాల్లో రెండింట్లో నటించిన శ్యామల.. బుల్లితెరకి, వెండితెరకి పెద్ద తేడా లేదని చెప్పింది. కానీ సీరియల్స్ కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని చెప్పింది. 

ఇక ఇండస్ట్రీలో తనకొక గాడ్ ఫాదర్ ఉన్నారని చెప్పింది. తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా.. ముందుగా తన భర్తతో చర్చిస్తానని చెప్పిన శ్యామల.. తన జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారని చెప్పింది.

'మా ఊరి వంట' షో నిర్మాత వెంకటేశ్వరావు గారంటే తనకుఎంతో గౌరవమని.. నాలుగేళ్ల పాటు తనను ఆ షో కోసం యాంకర్ గా కంటిన్యూ చేశారని.. వెయ్యికి పైగా ఎపిసోడ్స్ చేశానని వెల్లడించింది. ఇండస్ట్రీలో తనను ఎంతో సపోర్ట్ చేశారని.. ఆయన కుటుంబం కూడా తనతో ఎంతో సన్నిహితంగా ఉంటారని.. తనకు మరో పుట్టినిల్లు అంటూ చెప్పుకొచ్చింది.