ట్విట్టర్ లో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉంటూంటారు. ఎంతో మంది తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా ఆయన దృష్టికి తీసుకొస్తుంటారు. ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి  వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు నెటిజన్లతో సరదాగా చిట్ చాట్ చేస్తుంటారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు ఇస్తుంటారు.ఆయన ట్విటర్‌లో #AskKTR పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ నేపధ్యంలో  ఆయన్ని ఓ నెటిజన్ ఓ ఇంట్రస్టింగ్ ప్రశ్న అడిగారు.

బన్నీ డౌట్.. 'అల.. వైకుంఠపురములో' రీ షూట్?

అన్నా మీరు సినిమాల్లో నటిస్తారా... ఒక వేళ చేస్తే కనుక  ఓ కొత్త సోషల్ మెసేజ్ మీ నుంచి ఎక్సపెక్ట్ చేస్తాం అని అడిగారు. దానికి వెంటనే  కేటీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్స్ నాకు ఫుల్‌ టైం జాబ్ ఉందంటూ’ సమాధానమిచ్చారు. దీనికి.. మరికొందరు నెటిజన్స్.. సూపర్ కామెంట్ అంటూ  షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫుల్‌గా వైరల్ అయ్యింది.
 
అలాగే మూడు రాజధానులపై ట్విటర్‌ వేదికగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ‘మీరు తెలంగాణకు చెందిన వారన్న సంగతి ఒక్కక్షణం మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? రాజధాని నగరం, హైకోర్టు ఇవేనా అభివృద్ధి అంటే?’ అని ప్రశ్నించగా, కేటీఆర్‌ తెలివిగా సమాధానం ఇచ్చారు. అది నిర్ణయించేది తాను కాదని,  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలని అన్నారు.