అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నాయి. ఇకపోతే నేడు సినిమాకు సంబందించిన ఒక రూమర్ వైరల్ అవుతోంది. అది నిజమా అబద్దమా అనే తెలుసుకునే లోపే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ఇంకా ఎండ్ అవ్వలేదా అనే టాక్ వస్తోంది. ఇటీవల డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. అయితే ఇప్పుడు కొన్ని సీన్లను రీ షూట్ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పలు సీన్లపై ఏ మాత్రం సంతృప్తికరంగా లేడట.

హిట్టు కథలతో బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన తెలుగు దర్శకులు

సినిమా డబ్బింగ్ అనంతరం సినిమా చూశాక చాలా అసంతృప్తి వ్యక్తం చేసిన బన్నీ వెంటనే సెకండ్ హాఫ్ మిడ్ లో పలు సీన్స్ ని రీ షూట్ చేద్దామని త్రివిక్రమ్ తో చర్చించారట.  వెంటనే చిత్ర యూనిట్ హైదరాబద్ లోని ఒక స్టూడియోలో పలు సీన్లను సరికొత్తగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఫిల్మ్ నగర్ లో టాక్ గట్టిగా వైరల్ అవుతోంది.

ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఓ వైపు యాంటీ ఫ్యాన్స్ సినిమాపై నెగిటివ్ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్న తరుణంలో సినిమాకు ఇలాంటి టాక్ రావడం నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి చిత్ర యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. గీత ఆర్ట్స్ - హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోంది.