సాధారణంగా హీరో, హీరోయిన్లు తము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని బయటకి చెప్పరు. పలానా హీరోయిన్ కి ఆ హీరోతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కానీ నటి కృతి కర్భందా మాత్రం తను ప్రేమలో ఉన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో దాయడానికి ఏమీ లేదని.. తన ప్రేమ విషయం తల్లితండ్రులకు కూడా తెలుసునని వెల్లడించింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత 'బోణీ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ 'తీన్మార్' సినిమా నటించే ఛాన్స్ దక్కించుకొని కాస్త క్రేజ్ తెచ్చుకుంది. 

శ్రీను వైట్ల హైబడ్జెట్ మూవీ.. హీరో ఎవరో తెలుసా?

కానీ సినిమా నిరాశ పరచడంతో ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. 'బ్రూస్ లీ' సినిమాలో చరణ్ కి అక్క పాత్రలో నటించి ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు. బాలీవుడ్ పై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన 'హౌస్ ఫుల్ 4' సినిమాలో నటించింది. అలానే 'పాగల్ పంతీ' అనే సినిమాకి గ్రాన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న పులకిత్ సామ్రాట్ తో కృతి ప్రేమలో ఉందంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అతడితో కలిసి పార్టీలకు, ఈవెంట్ లకు హాజరవ్వడంతో వార్తలు మరింత బలంగా వినిపించాయి. ఇంతవరకు ఈ విషయంపై నోరు మెదపని కృతి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

తను సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఒక వ్యక్తి నచ్చడానికి ఐదేళ్లు లేదా పదేళ్లు పట్టొచ్చని కానీ తనకు పులకిత్ ఐదు నెలల్లోనే అర్ధమయ్యాడని.. తన మీద ఉన్న నమ్మకంతోనే ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు తనకు ఎంతో మనశ్శాంతిగా ఉందని చెప్పింది.

ఇది ఇలా ఉండగా.. పులకిత్ కి గతంలోనే వివాహం జరిగింది. శ్వేతా రోహిరాని పెళ్లి చేసుకున్న పులకిత్ కొన్ని విభేదాల కారణంగా ఆమెతో విడిపోయారు. ఇప్పుడు కృతితో డేటింగ్  చేస్తున్నాడు పులకిత్. మరి వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందో లేదో చూడాలి!