సినిమా ప్రమోషన్ కోసం రకరకాల గేమ్ లు ఆడుతూంటారు దర్శక,నిర్మాతలు. తాజాగా అలాంటిదే ఒకటి తెలుగు పరిశ్రమలో జరిగింది. రాహు సినిమా గత శుక్రవారం(పిబ్రవరి 28) న విడుదలైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు టాక్ యావరేజ్..కలెక్షన్స్ బిలో యావరేజ్. సినిమాని పట్టించుకున్న వాళ్లే లేరు. చాలా చోట్ల ఓపినింగ్స్ కూడా కష్టమైంది. అయితే ఊహించని విధంగా ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకు కారణం ఈ క్రైమ్ థ్రిల్లర్ హీరోయిన్ జీవితం లో నిజంగానే క్రైమ్ జరిగటమే.

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో కాల్స్ చేసి ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయాలి,ఆడిషన్ చేయాలి అని రాహు మూవీ హీరోయిన్ క్రితి గార్గ్ ను ముంబై కి రమ్మన్నాడు ఓ అజ్ఞాతవ్యక్తి. అయితే అది నిజామా కదా అని తెలుసుకోకుండానే ముంబై కి వెళ్ళింది హీరోయిన్... అయితే ఆ తర్వాత ఆమె నంబర్ కలవడం లేదు కంగారుపడుతున్నారు తన కుటుంబసభ్యులు. అయితే దర్శకుడు సుబ్బు ... ఈ విషయం పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడు. దాంతో ఈ విషయం మీడియాలో, టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  

ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. హీరోయిన్ ని ట్రాప్ చేసిన వ్యక్తి!

అయితే ఈ కిడ్నాప్ ఉదంతంపై హీరోయిన్ కృతి గార్గ్ వివరణ ఇచ్చింది. తాను ముంబైకు ఈ ఉదయమే ఫ్లైట్‌లో వచ్చానని, ఆ తర్వాత అలసీ పోయి ముంబైలో ఉన్న ఇంటికి వెళ్లినట్టు వివరణ ఇచ్చింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మరిచిపోవడంతో స్వి,చ్ఛాఫ్ అయిందని చెప్పుకొచ్చింది.

అయితే ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడుతో కలిసి ఆమె ఆడిన డ్రామా అని మీడియాలో వినపడుతోంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా హీరోయిన్ కృతి గార్గ్‌తో పాటు దర్శకుడు సుబ్బు కావాలనే ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటూ ఈ కిడ్నాప్ డ్రామా ఆడారని అంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ రిలీఫ్ ఫీలైతే, మరికొందరు ..పబ్లిసిటీ కోసం ప్రభాస్ ని అడ్డం పెట్టి గేమ్ ఆడతారా అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మొత్తానికి సినిమా మాటేమో కానీ, ఈ కిడ్నాప్ ఉదంతంతో హీరోయిన్‌గా కృతి గార్గ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.