సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ హీరోయిన్ రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” . భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 

ఈ చిత్రంలో చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. లేడీ అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరువాత  కీలక పాత్రలో ఈ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఉందని తేల్చి చెప్పారు అనీల్ రావిపూడి.  అది మరేదో కాదు సూపర్ స్టార్ కృష్ణ కనపడటం. అయితే ఆయన ఎలా కనపడతాడు అనే విషయమై మీడియాలో ఓ విషయం ప్రచారం అవుతోంది.

రజనీకాంత్ 'దర్బార్' కథ ఇదే?


అందుతున్న సమాచారం మేరకు కృష్ణ ఈ సినిమాలో నటించలేదట. అయితే ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం అల్లూరి సీతారామరాజులోని కొన్ని సీన్స్ ని ఈ సినిమా కోసం వాడుతున్నారట. సినిమాలో విలన్ గా చేస్తున్న ప్రకాష్ రాజ్ ఓ టైమ్ లో ఈ అల్లూరి సీన్స్ ని మరో విలన్ అయిన అజయ్ కు చూపెడతాడట. ఆ టైమ్ లో కృష్ణ తెరపై కనపడతారని చెప్తున్నారు. ఇదే కనక నిజమైతే కృష్ణగారి అభిమానులకు నిరాశే.
 
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ఒక బిగ్ సర్ ప్రైజ్ ను రివీల్ చేశారు . “సరిలేరు నీకెవ్వరు ” మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు, ఏ సందర్భంలో కనపడతారు అనేది సస్పెన్స్. ఆయన మూవీ లో కనిపించే సీన్ కు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన రీ రికార్డింగ్ అదిరిపోయింది, ఈ మూవీ ఇంత బాగా రావడానికి శ్రమించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు.

ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు. ఇక బిజినెస్ మెన్ సినిమా తర్వాత మహేష్ కెరియర్ లో అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం.. జూన్ 1న ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్ 18న షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇక అంతే త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు. సినిమా బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని, ఆర్మీ రోల్ లో మహేష్ నటన బాగుందని అంటున్నారు. ఈ సంక్రాంతికి మహేష్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి సినిమాకి అంతా పాజిటివ్‌ టాకే  ఉంది.