పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాలు చేయడం మానేశారు. ఆయన రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా పవన్ 'పింక్' తెలుగు రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. షూటింగ్ కి పాతిక నుండి ముప్పై రోజుల సమయం సరిపోతుందని  పవన్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'.. బ్రహ్మీ, అలీ రేంజ్ తగ్గిందా..?

ఇప్పుడు దర్శకుడు క్రిష్ కూడా పవన్ తో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఓ జానపద కథ చెప్పి పవన్ తో సినిమా ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత క్రిష్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. పవన్ ని సినిమాకి ఒప్పించి గ్రాండ్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి.

జానపద కథ కాబట్టి గుర్రపు స్వారీ, కత్తి తిప్పడం, పోరాటాలు వంటి సన్నివేశాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు క్రిష్. ఇటీవల పవన్ వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇలాంటి సమయంలో సినిమా కోసం రిస్కీ షాట్స్ చేయడానికి వీల్లేదు.

పైగా పవన్ తో సినిమా అంటే ఆషామాషీ కాదు. ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. కాబట్టి క్రిష్ రెగ్యులర్ తీసేసే సినిమాల పవన్ ని ట్రీట్ చేస్తే కుదరదు. కాబట్టి సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించాలి.

పవన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా కోసం అన్ని రోజులు సమయం కేటాయించలేరు. ఇవన్నీ తెలిసినా.. క్రిష్ మాత్రం తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!