సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తన శిష్యుడు సిద్ధార్థ తాతోలుతో కలిసి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొదట్లో ఈ సినిమాను అందరూ తేలికగా తీసుకున్నారు కానీ దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వివాదాస్పదంగా ఉండడంతో జనాల దృష్టి దీనిపై పడింది.

'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' ట్రైలర్.. బెజవాడ రౌడీయిజం, బాబు, పవన్ టార్గెట్ గా..

నిన్నమొన్నటి వరకు తక్కువ క్వాలిటీతో ఎవరో తెలియని ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి నాసిరకం సినిమాలు చేసిన వర్మపై నెగెటివ్ కామెంట్స్ వినిపించేవి. వర్మ సినిమాల్లో కంటెంట్ తో పాటు క్వాలిటీ కూడా సరిగ్గా లేదనే టాక్ వచ్చేసింది. ఇలాంటి నేపధ్యంలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్ పెట్టి వివాదాస్పద సినిమా తీస్తే ఈసారి కూడా చిన్న ఆర్టిస్ట్ లతో కానిచ్చేస్తారని అనుకున్నారు.

కానీ సినిమా ట్రైలర్ లో కాస్త పేరున్న వారు కనిపించడం విశేషం. బ్రహ్మానందం, అలీ లాంటి ప్రముఖ కమెడియన్లు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ లో ప్రత్యేకంగా కనిపించారు. ఇంతటి కాంట్రవర్శియల్ సినిమాలో వీరిద్దరూ నటించి ఉంటారని ఎవరూ ఊహించలేదు. కానీ ట్రైలర్ లో కనిపించి షాక్ ఇచ్చారు. ఈ సినిమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన అలీ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం హాట్ టాపిక్ గా మారింది. 

 

 

మరోవైపు సినిమాల్లో బాగా అవకాశాలు తగ్గిపోయిన బ్రహ్మీ కూడా ఈ సినిమాలో కనిపించడం విశేషమే. అలీ, బ్రహ్మీలు ఛాన్స్ లు లేక తమ స్థాయిని తగ్గించుకొని ఈ సినిమాలో చేశారా..? లేక వర్మ తన కథతో వారిని ఒప్పించాడా..? అనేది అంతుపట్టని విషయం. ఈ సినిమాలో జగన్ పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు అజ్మల్ నటించడం గమనార్హం.